Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan on Jana Sena Five Man Committee: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్టాళ్లను పరిశీలించిన ఆయన.. స్థానికులతో మాట్లాడారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పిఠాపురం అభివృద్ధి, కూటమి ప్రభుత్వం, జనసేన కార్యకర్తలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
‘పిఠాపురం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం రాష్ట్ర అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు పునాది వేసినట్లే. నా విజయానికి మద్దతుగా నిలిచిన టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు. ఈ గెలుపు బలమైన రాజకీయ ప్రయాణానికి నాంది పలికింది. గెలుపు, ఓటమి గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. దేశంలోనే పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నా. పిఠాపురం ఆధ్యాత్మికంగానూ అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటున్నా. ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం అసాధ్యంగా కనిపించిన పనిని సుసాధ్యం చేశాం. ఇందుకోసం నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి అనుమతులు తీసుకొచ్చాను’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
‘నేను పిఠాపురంలోనే కూర్చొని ఉంటే అన్ని పనులు పూర్తయ్యేవి కావు. ఏ స్థాయిలో, ఎవరితో మాట్లాడితే పనులు ముందుకు సాగుతాయో నాకు తెలుసు. అభివృద్ధి కార్యక్రమాల కోసం అవసరమైన చోట చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన గౌరవానికి భంగం కలగకుండా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలి. కూటమి ప్రభుత్వం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముందుగా ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చిన తర్వాత వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు పనిచేద్దాము’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
పిఠాపురంలో జనసేన ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ పని తీరు సరిగా లేదన్నారు. ఎన్నికల సమయంలో ఉత్సాహంగా పనిచేసిన కొందరు.. ఎన్నికలు పూర్తయిన తర్వాత చల్లబడిపోయారని అన్నారు. ఇకపై పిఠాపురం అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టేందుకు త్వరలోనే ఇక్కడ తన క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటానని జనసేనాని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..