పోషకాహారల జాబితాలో గుడ్డు మొదటి ప్లేస్ లో ఉంటుంది.

విటమిన్-C, ఫైబర్ మినహా గుడ్డులో అన్ని పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అందుకే గుడ్డు తినాలని అందరూ అంటారు. 

చాలామంది బలం వస్తుందని పచ్చిగుడ్డు తాగేస్తుంటారు. అయితే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. 

తెల్లసొనలో 'ఎవిడిన్' అనే పోషకాహార నిరోధకం ఉంటుంది. 

ఇది బయోటిన్తో కలిసిపోయి, శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటుంది. 

అదే గుడ్డు వేడి చేసి తీసుకుంటే.. అది బయోటిన్ నుంచి విడిపోతుంది. 

అప్పుడు ఆ పోషకాహార నిరోధకం శరీరానికి అందుతుంది. 

గుడ్డులో ట్రిప్సిన్ అనే ఎంజైమ్ 'ఎవిడిన్'ను నిర్వీరం చేస్తుంది.

పచ్చిగుడ్డు తినకుండా వండుకొని తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.