విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో సీఎం జగన్ సమావేశమయ్యారు. తొలిసారిగా ఏపీ చీఫ్ జస్టిస్‌తో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కావడంపై ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వీళ్లిద్దరూ గతంలో పలు సందర్భాల్లో కలుసుకున్నా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి.
అయితే సీఎం జగన్, చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ భేటీ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో పీకే మిశ్రా నేతృత్వంలో ఏపీలో మూడు రాజధానులు, అమరావతిలో పనులు తదితర అంశాలపై తీర్పులు వచ్చాయి. ఈ క్రమంలో వీరు భేటీ కానుండటం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈ నెల 29న ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, సీజేల సమావేశం జరగనుంది. దీనికి సన్నాహకంగా జగన్, పీకే మిశ్రా భేటీ జరుగుతోందని సమాచారం. అలాగే జ్యుడీషియల్ ప్రివ్యూతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
CM Jagan: ప్రకృతి వ్యవసాయం కోసం కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులివ్వాలి