CM YS Jagan: గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వైఎస్సార్ రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు.. ఇక, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు.. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు కచ్చితంగా వస్తుందన్న ఆయన.. గతంలో వైఎస్సార్ పాలనలో కూడా సమృద్ధిగా వర్షాలు పడేవి.. రైతులు సుభిక్షంగా ఉన్నారు.. మంచి మనసుతో పరిపాలన చేస్తే దేవుడు కూడా కరుణిస్తాడు.. ఈ సమయంలో కుప్ తో సహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.. అయితే, 2014 నుండి 19 వరకు కరువు తాండవించేది అని గుర్తుచేశారు.. గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు జాడ లేదన్న సీఎం.. ఒక్క మండలం కూడా కరువు మండలంగా మారలేదన్నారు.
Read Also: CM YS Jagan: రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్.. ఇవాళే ఆ సొమ్ము పంపిణీ
ఇక, రాష్ట్రంలో ఆహార ధాన్యాలు దిగుబడి పెరిగింది.. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ చేస్తున్నాం అన్నారు సీఎం జగన్.. నాలుగేళ్లలో 2.94 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు.. ఇప్పటి వరకు రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి వేలు 67 వేలు అందించాం… రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు 27 ,062 కోట్ల రూపాయల నిధులు జమ చేశామని తెలిపారు. మరోవైపు.. మాందుస్ తుఫాన్ తో నష్టపోయిన రైతులకు 77 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు.. గడిచిన నాలుగేళ్లలో 1,911 కోట్ల రూపాయలు ఇన్‌ఫుట్ సబ్సిడీగా నిధులు మంజూరు చేశామని.. ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్న ప్రభుత్వం మనది.. దేశంలోని అన్ని రాష్ట్రాలు మన ఆర్బీకేలను ఆదర్శం గా తీసుకున్నాయన్నారు. ఇక, 27,800 కోట్లతో రైతు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వెల్లడించారు ఏపీ సీఎం..
రైతుల కోసం మొత్తం లక్షా నలభై ఐదువేల కోట్లు ఖర్చు పెట్టామన్న ఆయన.. మనం చేస్తున్న పనులకు అసూయపడుతున్న వారికి చెప్తున్న , అసూయకు అసలు మందు లేదు అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబుది పెత్తం దార్ల పార్టీ.. మనది ప్రజల పార్టీ.. పెత్తందార్లకు, సామాన్య ప్రజలకు మధ్య పోటీగా అభివర్ణించారు సీఎం వైఎస్ జగన్.. రైతులను వంచించిన చంద్రబాబుకు రైతుల కోసం పని చేస్తున్న మీ బిడ్డకి మధ్య యుద్దం జరుగుతుంది.. కరువు తో ఫ్రెండ్ షిప్ చేసే చంద్రబాబుకు, వరుణిడి ఆశీస్సులు ఉన్న మీ బిడ్డ జగన్ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోందని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.