అమరావతి రాజధాని వ్యవహారం తెలుగుదేశం పార్టీ నేతలను వెంటాడుతూనే ఉంది.. తాజాగా, అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.. ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు.. ఈ కేసులో ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏ2గా మాజీ మంత్రి నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్, ఏ4గా లింగమనేని రాజశేఖర్, ఏ5గా అంజనీకుమార్, ఏ6గా…