ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి… రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,526 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 16 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3001 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,31,555 కు చేరుకోగా.. రికవరీ కేసులు 18,96,499 కు పెరిగాయి..
read also : ఆహాలో హారర్ వెబ్ సీరిస్ ‘అన్యాస్ ట్యూటోరియల్’
ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,097 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24,85 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 81, 740 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 33, 96, 437 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.