సీఎంకు బహిరంగ లేఖ రాస్తాను. 2015లో రాయచోటి లో నమోదైన కేసును ఎత్తివేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రిలో మతతత్వ వైఖరి కనపడుతోంది అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముస్లిం లపై కేసులు ఎత్తివేస్తున్నారు.. జగన్ సెక్యులర్ ముఖ్యమంత్రి అవునా… కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జీవో లను ఆన్ లైన్ లో నుంచి తీసివేయడం దారుణం. టిప్పు సుల్తాన్ కన్నా అబ్దుల్ కలాం విగ్రహం పెట్టవచ్చు కదా. వక్ఫ్ బోర్డ్ లకు ప్రభుత్వ నిధులు ఇస్తారు. కానీ టీటీడీ నుంచి మాత్రం నిధులు తీసుకుంటారు… ఇదేం పద్ధతి. ఇలాంటివి ప్రశ్నిస్తే మాపై మతతత్వ ముద్ర వేస్తారు అని అన్నారు.
ఏపీలో తెలుగు భాష కోసం ఉంధ్యం చేపడుతాం.గిడుగు జయంతిని పురస్కరించుకుని ఈనెల 29 నుంచి వారం రోజుల పాటు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నాము. అప్పు-నిప్పు పేరిట ఓ రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో నిర్వహిస్తాము. జల వివాదాల విషయంలో తెలంగాణ తరహాలో మనం ఎందుకు గట్టిగా మాట్లాడ్డం లేదు… ఇక్కడ సరైన ఇంజనీర్లు లేరు. పోతిరెడ్డిపాడు ను కూల్చివేస్తామని కొందరు అంటున్నారు. దమ్ముంటే వారిని రమ్మంటున్నాం … అలాంటి చర్యలు బిజెపి చూస్తూ ఊరుకోదు. తిరుపతిలో ఫ్లై ఓవర్ పేరు మార్పు ముఖ్యం కాదు… ముందు నిర్మాణం పూర్తి చేయండి అని పేర్కొన్నారు.