Fake Liquor Case: అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కల్తీ మద్యం కేసులో మరో ఇద్దరు A14 బాలాజీ, A19 సుదర్శన్ లను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం తయారీ కోసం బెంగళూరు నుంచి స్పిరిట్, వాటర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ మోటార్లు, ఎస్ఎస్ ట్యాంక్ కొనుగోలు చేసి పంపించిన బాలాజీ , సుదర్శన్ లను బెంగళూరులో అదుపులో తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు.
Read Also: Golden Cobra: బంగారు వర్ణంలో నాగుపాము.. నాగులపంచమి రోజే కనిపించడంతో.
ఇక, నిన్న బెంగళూరులో వీరు ఇద్దరిని అరెస్ట్ చేసి మదనపల్లిలోని రహస్య ప్రాంతంలో విచారించిన అనంతరం ఈరోజు జడ్జి ముందు ఎక్సైజ్ పోలీసులు ప్రవేశ పెట్టనున్నారు. బాలాజీ, సుదర్శన్ లు ఇద్దరు బెంగళూరుకు చెందిన తండ్రి కొడుకులు.. జూన్ నెలలో కల్తీ మద్యం తయారీకి కావాల్సిన ముడి సరుకులు, ఎలక్ట్రికల్ వస్తువులను కొనుగోలు చేసి పంపించినట్లు విచారణలో తేలింది.