మన చుట్టూ జరిగే అన్ని వింతలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని మాత్రమే మనకు కనబడుతుంటాయి. కొన్ని సార్లు వాటిని మన కళ్లు కూడా వాటిని నమ్మవు. ఇది నిజమా అబద్దమా అనే సందేహంలో ఉంటాం… ప్రస్తుతం ఓ పాము సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. కాకపోతే సాధారణంగా కనిపించే పాము మాత్రం కాదు.. కాస్త వెరైటీగా ఉంది. అది చూసేందుకు బంగారు వర్ణంలో మెరుస్తూ ఉంది. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
Read Also: Shocking Viral Video: ఏందయ్యా ఇది.. మరీ అక్కడ ఎలా కూర్చున్నారు..తేడా వస్తే.. అంతే…
పూర్త వివరాల్లోకి వెళితే.. ఈ వీడియో నాగుపాము పడగవిప్పి కనిపిస్తుంది. కానీ అది బంగారు వర్ణంలో కనిపించడం.. అది కూడా.. నాగుల పంచమి రోజు దర్శనమివ్వడంతో చాలా నాగదేవత వచ్చిదంటూ భక్తులు నమ్ముతున్నారు. సూర్యుడి కాంతి ఆ పాము పడగపై పడటం వల్లే ఆ సర్పం అలా మెరిసిపోతుందని కొందరు అంటాన్నారు. ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని మరికొందరు నెటిజన్లు భావిస్తున్నారు. మనం ఎన్నో రకాలైన సర్పాలను చూస్తుంటాం. కానీ ఈ పాము మాత్రం చూసేందుకు విచిత్రంగాను.. ఆశ్చర్యంగాను ఉంది. జన్యుపరమైన మార్పులు కారణంగానే పాము పడగ భాగం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
Read Also:Beggar Woman: వామ్మో.. ఆమె దగ్గర అన్ని పైసలా.. నోరెళ్లబెట్టిన జనం..
నాగుల పంచమి నాడు ఇలాంటివి వైరల్ కావడంతో మరికొందరు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. విశేషమైన రోజున ఇలాంటి వింత పామును చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఇది ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ క్రియేటీవిటి అంటూ కొట్టి పారేస్తున్నారు.