దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రతిరోజూ 55 లక్షల మందికి పైగా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ మెట్రోను NCR లైఫ్ లైన్ అని కూడా పిలుస్తారు. అయితే.. ఢిల్లీ మెట్రోలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించే ఉదంతాలు చాలాసార్లు వెలుగులోకి వచ్చాయి. చాలా సార్లు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఫ్లోర్‌పై కూర్చోవడం కనిపిస్తుంది. టికెట్ లేకుండా ప్రయాణించడం, ఫ్లోర్‌పై కూర్చోవడం, జరిమానా విధించే విషయంలో మెట్రో నిబంధనలు రూపొందించింది.
Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తే జరిమానా..
ఎవరైనా టికెట్ లేకుండా ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రూల్స్ లోని సెక్షన్ 69 ప్రకారం టికెట్ లేని ప్రయాణికుడికి రూ.50 జరిమానా విధిస్తారు.
ఫ్లోర్‌పై కూర్చోవడంలో జాగ్రత్తగా ఉండండి..
టికెట్ లేని విషయంలోనే కాకుండా మెట్రో లోపల ఫ్లోర్ పై కూర్చోవడంలో నిబంధనలు రూపొందించారు. ఢిల్లీ మెట్రో లోపల పరిశుభ్రత పాటించడం ప్రయాణికుల బాధ్యత. ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నేలపై కూర్చుని చెత్తను వేస్తే, అతనిపై సెక్షన్ 59 ప్రకారం చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో సెక్షన్ 59 ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.200 జరిమానా విధిస్తారు.
మహిళల కోచ్‌లో పురుషులు ప్రయాణించకూడదు..
ఢిల్లీ మెట్రో మెట్రో మొదటి కోచ్‌ను మహిళల కోసం రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మహిళా కోచ్‌లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తే, అతనిపై చర్య తీసుకుంటారు. ఢిల్లీ మెట్రో రైల్వే చట్టం 2002లోని సెక్షన్ 64 (1) ప్రకారం సంబంధిత వ్యక్తికి రూ.250 జరిమానా విధించబడుతుంది.