ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 1న ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో మొత్తం 4.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1.99 కోట్ల మంది, మహిళలు 2.4 కోట్ల మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 4,041 మంది ట్రాన్స్ జెండర్లు, 67,090 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. అయితే ఏపీలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటం విశేషం. ఏపీ వ్యాప్తంగా 45,678 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు తూ.గో. జిల్లాలో అత్యధికంగా 43,31,945 మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,94,362 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.