Sailajanath: ఇంకా ఎన్నిసార్లు బీజేపీ చేతిలో మోసపోతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు.. ఇక, మంగళవారం ఏపీ వచ్చిన ఆమె.. తనకు ఓటు వేయాల్సింది కోరుతూ ప్రచారం నిర్వహించారు.. అయితే, వైసీపీ, టీడీపీపై మండిపడుతోంది కాంగ్రెస్ పార్టీ.. బీజేపి చేతిలో ఇంకా ఎన్నిసార్లు మోసపోతారని నిలదీశారు పీసీసీ చీఫ్ శైలజానాథ్.. ఏపీలో వరదలకు సహాయం పొందలేకపోవడం, సకాలంలో జీతాలకు నిధులు రాకపోవడం, రోడ్లు వేయలేకపోవడం, ప్రత్యేక హోదా సాధించుకోక పోవడం ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఫల్యానికి నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు సాధించుకోవాలన్న మాట సీఎం జగన్ నోటి నుంచి రాలేదని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నది సీఎం హోదా ఎంజాయ్ చేయడానికో, సొంత విషయాలు మాట్లాడుకోవడానికో కాదని హితవుపలికారు.
Read Also: Robbery in Kukatpally: వాచ్‌మెన్‌గా చేరాడు.. రూ.. 55 లక్షల సొత్తుతో పరార్ అయ్యాడు
Also Read
ఇక, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అడకుండానే ఎగబడి ఎన్డీఎ అభ్యర్థికి మద్దతు ఇచ్చారని జగన్, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు శైలజానాథ్.. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారన్న ఆయన.. చంద్రబాబు ఎన్నిసార్లు బీజేపి చేతిలో మోసపోతారని అడుగుతున్నాను.. తమ అసమర్థతకు, భయానికి సామాజిక న్యాయం అనే ట్యాగును చంద్రబాబు, జగన్ వేస్తున్నారని మండిపడ్డారు.. విమానాశ్రయంలో గేటు కు ఒక వైపు వైసీపీ నేతలు, మరో వైపు టీడీపీ నేతలు పోటీపడి మద్దతు, స్వాగతం పలికాదని ఎద్దేవా చేశారు. బీజేపీకి దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోలేని సంఖ్యాబలం ఆంధ్రప్రదేశ్ లో ఉందని.. 175 మంది శాసన సభ్యులు, 25 మంది లోక్ సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఏపీ నుంచి ఉందన్నారు శైలజానాథ్.
తాజావార్తలు
-
Tamil Nadu: విజయ్‌కు గవర్నర్ బిగ్ షాక్!.. లోక్‌భవన్ కీలక ప్రకటన.. ఇప్పట్లో ప్రమాణస్వీకారం లేనట్లేనా?
-
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!