BCCI Trolls: పర్ఫామెన్స్‌కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్‌లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
- టీ20ల్లో టీమిండియా వరుస పరాజయాలు
- ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై మూడు టీ20ల్లో ఓటమి
- టీమిండియా ఎంపికలపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Selection Debate: టీమిండియా గత 5-6 టీ20ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐర్లాండ్‌పై రెండు, ఇంగ్లండ్‌పై మూడు టీ20ల్లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపికలో ప్రతిభ కంటే వ్యక్తిగత అనుబంధాలు, లాబీయింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు.. బీసీసీఐ, సెలెక్టర్లపై విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ పోస్టులో టీమిండియా ఆటగాళ్ల ఎంపికపై నెటిజెన్స్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మద్దతు కారణంగా అవకాశం దక్కిందని, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అతని వయస్సు కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని నెటిజెన్స్ పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం దేశవాళీ క్రికెట్లో రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చిన ఏకైక ఆటగాడని అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టులో చోటు సంపాదించాడని పేర్కొన్నారు. శివమ్ దూబేను స్పిన్ బౌలర్లపై భారీ షాట్లు ఆడగలడనే ఉద్దేశంతో ఎంపిక చేసినా.. స్పిన్ బౌలింగ్‌కే బలవుతున్నాడని విమర్శించారు. తిలక్ వర్మ ఎంపిక వెనుక రోహిత్ శర్మ మద్దతు, ముంబై లాబీ ప్రభావం ఉందని ఆరోపించారు.
Also Read
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
అక్షర్ పటేల్‌కు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన కీలక ఇన్నింగ్స్, ఫీల్డింగ్ కారణంగా అవకాశాలు కొనసాగుతున్నాయని.. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కారణమని ఆ పోస్టులో నెటిజెన్స్ పేర్కొన్నారు. భారత క్రికెట్లో ప్రస్తుతం ప్రదర్శన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రజత్ పాటీదార్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత టీ20 జట్టులోని చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలరని అభిప్రాయపడ్డారు. ఇషాన్, శ్రేయాస్ మాత్రమే అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించారని ఫాన్స్ పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!+
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!