Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, అలాగే కొరియన్ ఫ్లేవర్‌తో వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘కమ్సహమ్నిద’ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను వదిలారు. వచ్చే ఆగస్టు 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
రిలీజ్ డేట్ పోస్టర్లో వరుణ్ తేజ్ లుక్ నెక్ట్స్ లెవెల్లో ఉంది. రగ్గడ్ అండ్ అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో ఒక కుర్చీలో కూర్చుని.. ఒక చేతిలో రక్తం అంటిన కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని ఫుల్ అటిట్యూడ్‌తో కనిపించారు. చీకటిగా ఉన్న ఒక వేర్‌హౌస్‌లో డేంజరస్ కొరియన్ గ్యాంగ్స్టర్స్ ఆయనను చుట్టుముట్టి ఉన్నప్పటికీ, వరుణ్ తేజ్ ఏమాత్రం భయం లేకుండా పవర్ఫుల్ లుక్‌తో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సినిమాలోని ఆయన క్యారెక్టరైజేషన్‌ను ప్రతిబింబిస్తోంది. బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న నియాన్ లైటింగ్ విజువల్‌గా సినిమాను చాలా రిచ్‌గా ప్రెజెంట్ చేస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, స్టార్ కమెడియన్ సత్య ఒక కీలకమైన పాత్రలో నవ్వులు పూయించనున్నారు. టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ ఈ చిత్రానికి అదిరిపోయే బాణీలు అందిస్తుండగా, మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కొరియన్ కల్చర్, గ్యాంగ్‌స్టర్ డ్రామాను లోకల్ కామెడీకి మిక్స్ చేసి మేర్లపాక గాంధీ మార్క్ హారర్ కామెడీ ఎలిమెంట్స్‌తో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రిలీజ్ డేట్ ఖరారు కావడంతో ఇకపై వరుస అప్డేట్లతో ప్రమోషన్ల డోస్ పెంచేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!