Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల నివాస ప్రాంతమైన ఫిలింనగర్లో అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కొందరు యువకులు మితిమీరిన వేగంతో నడిపిన ఓ కారు.. టాలీవుడ్ యంగ్ హీరో, ‘డ్రింకర్ సాయి’ సినిమా ఫేమ్ ధర్మ మహేష్ నివాసంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు కారును అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడిపారు. ఫిలింనగర్ రోడ్డులో వస్తూ ఒక్కసారిగా కారుపై నియంత్రణ కోల్పోవడంతో, అది నేరుగా ధర్మ మహేష్ ఇంటి వైపు దూసుకువచ్చింది. తీవ్రమైన వేగంతో వచ్చి ఢీకొట్టడంతో ఇంటి ప్రధాన గేటుతో పాటు కాంపౌండ్ వాల్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో ఉన్నవారితో పాటు చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదం నుంచి ధర్మ మహేష్ కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటన జరిగిన వెంటనే సదరు యువకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మద్యం మత్తులో కారు నడిపిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హీరో ధర్మ మహేష్ కేవలం సినిమాల పరంగానే కాకుండా, గతంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాల వల్ల కూడా వార్తల్లో నిలిచారు. ఆయన భార్య గౌతమితో ఏర్పడిన మనస్పర్థలు, గొడవల కారణంగా కొన్నాళ్ల పాటు మీడియాలో, సోషల్ మీడియా వేదికల్లో ఈయన పేరు విపరీతంగా వైరల్ అయింది. ఆ వివాదాల నుంచి కోలుకుని కెరీర్‌పై దృష్టి పెడుతున్న తరుణంలో, ఇప్పుడు తాజాగా ఆయన నివాసంపై ఇలా కారుతో దాడి జరిగినంత పని కావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..