విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడం నేరం.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలో సిగరెట్ కాల్చాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. మన ఏపీకి చెందిన వ్యక్తే. కువైట్ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉండగా… అందులో ఏపీకి చెందిన మహ్మద్ షరీఫ్ (57) ఉన్నాడు. అతడు భద్రతా సిబ్బంది కళ్లు గప్పి తన లో దుస్తుల్లో దాచుకున్న సిగరెట్లను విమానంలోకి తీసుకువచ్చాడు.
Read Also: జపాన్ కు చేరిన గ్రీన్ ఇండియా చాలెంజ్
Also Read
విమానం టేకాఫ్ అయిన కాసేపటికి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. తోటి ప్రయాణికులు వారించినా షరీఫ్ వినలేదు. దీంతో వాళ్లు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. చివరకు ఎయిర్ హోస్టెస్ వచ్చి చెప్పినా అతడు సిగరెట్ తాగడం ఆపలేదు. ఈ క్రమంలో ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ సిబ్బందితో షరీఫ్ గొడవకు దిగాడు. దీంతో విమానం చెన్నైలో ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది షరీఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత చెన్నై ఎయిర్‌పోర్టులోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
తాజావార్తలు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
-
ICC ODI Rankings: టీమిండియా ‘వన్డే’ జైత్రయాత్ర.. ప్రపంచ ఛాంపియన్లనే వెనక్కి నెట్టి అగ్రస్థానంలో భారత్!
-
Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?