ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. గడిచిన 10 రోజులుగా వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్డేట్ చేస్తున్నారు. దీంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్లకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మ్యాపింగ్, కోడింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీంతో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా వెబ్ ల్యాండ్‌లో ఉన్న డేటాను ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.