ఏపీ వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. గడిచిన 10 రోజులుగా వెబ్‌ల్యాండ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు అప్‌డేట్ చేస్తున్నారు. దీంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్‌లకు ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత మ్యాపింగ్, కోడింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. దీంతో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడానికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రధానంగా వెబ్ ల్యాండ్‌లో ఉన్న డేటాను ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం…
విజయనగరంలో అధికారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయా ? ధరల నియంత్రణతో మంచి పేరు తెచ్చుకున్న అధికారికి…అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయా? వ్యవహారానికి పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వమే రంగంలోకి దిగింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్ కిషోర్ కుమార్. రెవెన్యూ విభాగానికి అధిపతి. జనవరి 2020 లో జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. వచ్చిన తొలినాళ్లలో మంచి పని వాడన్న ముద్ర వేసుకున్నారు. లాక్‌డౌన్‌లో నిత్యావసరాల ధరలను… ప్రజలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ మార్కెట్లను ఏర్పాటు…
ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు కొత్త కష్టం వచ్చింది. ధరణి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ స్లాట్ రద్దుచేసుకున్న వారికి ఏడాది గడిచినా ఇంకా డబ్బులు అందలేదు. ఇలా దాదాపు 2 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉండడంతో ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూపులు తప్పడం లేదు. గత ఏడాది అక్టోబర్లో ధరణి సేవలు తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అదే నెల 28 నుంచి తహశీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం మొదట స్లాట్…
అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనధికార లేఅవుట్ల ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 5 వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున హై కోర్టలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్…