Good News to Employees: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good News to Employees: ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మార్చి నెలాఖరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ముగిశాయి.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం.. అందరూ కలిస్తేనే.. ప్రభుత్వ లక్ష్యాలను సాధించడం సాధ్యం అనే స్పృహతోనే ఉన్నాం అన్నారు.. కోవిడ్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి.. ఆ ప్రభావం ఏపీ మీద కూడా పడింది.. ఆ క్రమంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం అన్నారు. వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మేం ప్రయత్నిస్తూనే ఉన్నాం అని తెలిపారు.
Read Also: Women Journalists: మహిళా జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం.. హాజరైన మంత్రులు
Also Read
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
- Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
- Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
- Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. పెండింగ్ క్లైమ్స్ మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.. జీపీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ బిల్లులు, టీఏ, ఏపీ జీఎల్ఐఏ అంశాల్లో ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించేస్తున్నాం అని వెల్లడించారు.. పెండింగ్ బిల్లుల పైనే నాలుగు గంటల పాటు చర్చించామని.. ఉద్యోగ సంఘాలకు స్పష్టత ఇచ్చామని.. ఈ నెలాఖరులోగా సుమారు రూ. 3 వేల కోట్లు చెల్లింపులు జరుపుతామని వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్.
Read Also: APSRTC: ఆర్టీసీ చరిత్రలో ఇదే తొలిసారి.. త్వరలో 1,500 డీజిల్, వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు..
మరోవైపు.. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఛాయ్, బిస్కట్ సమావేశం కాదు.. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. డీఏ బకాయిలను రెండు క్వార్టర్లల్లో క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.. మొత్తంగా రూ. 16 వేల కోట్ల బిల్లులు పెండింగులో ఉంటే.. రూ. 3 వేల కోట్లు క్లియర్ చేస్తామన్నారని.. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.. కోవిడ్ వల్ల ఒకటో తేదీన జీతాలివ్వలేకపోతున్నామని ప్రభుత్వం చెప్పింది.. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు కోవిడ్ ప్రభావం ఉంటుందని సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
IndiGo Flight: ల్యాండింగ్‌కు ముందు రన్‌వేను తాకిన ఇండిగో విమానం.. గో-అరౌండ్తో తప్పిన ప్రమాదం
-
Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!