Flex Banners: ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం వాయిదా.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.. నవంబర్ 1వ తేదీ నుంచి నిషేధం అమలులోకి వస్తుందంటూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది సర్కార్.. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించింది. అయితే, ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం అమలును ప్రస్తుతానికి వాయిదా వేసింది వైఎస్ జగన్ ప్ఱభుత్వం… ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై రేపటి నుంచే నిషేధం అమల్లోకి రావాల్సిఉండగా.. జనవరికి 26వ తేదీకి వాయిదా వేసింది.. అయితే, ఇప్పుడు అంతా ఫ్లెక్సీల మయమే.. చిన్నా టీ కొట్టు బోర్డు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ , హోర్డింగ్స్ అన్నీ.. ఫ్లెక్సీ ఫ్రింటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారులు ప్రభుత్వానికి విన్నవించారు.. వారి విజ్ఞప్తిని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించారు.
Read also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
దీంతో.. ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధాన్ని జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈలోగా వారికి చేదోడుగా నిలవాలని అధికారులకు సూచించిన ఆయన.. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలని.. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సీ తయారీదారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. మొత్తంగా.. నవంబర్ 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.. కాగా, పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వం.. ఎవరైనా ఈ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లయితే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధించాలని.. ఉల్లంఘనులను పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.. ఫ్లెక్సీలపై నిషేధం నోటిఫికేషన్ అమలు, పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణ, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు చేపట్టాలని సూచించిన విషయం విదితమే కాగా.. తాజా ఆదేశాలతో అది జనవరి 26వ తేదీకి వాయిదా పడింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!