AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: రహిత) అసెంబ్లీగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో ‘నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్’ (NeVA) సమర్థవంతంగా అమలు చేసేందుకు అసెంబ్లీ సచివాలయం వేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటినీ NeVA పోర్టల్‌కు అనుసంధానం చేయడం ద్వారా శాసనసభ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చాలని నిర్ణయించారు.
ఈ డిజిటల్ విధానంపై అవగాహన కల్పించేందుకు మంత్రుల ప్రైవేట్ సెక్రటరీలకు (పీఎస్‌లు) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శాసనసభ సమావేశాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలు, ప్రవేశపెట్టే బిల్లులు, వివిధ నోటీసులకు ఆన్లైన్ ద్వారానే వేగంగా సమాధానాలు పంపే విధానంపై ఈ శిక్షణలో పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. దీనివల్ల ఫైళ్ల కదలికలో జాప్యం తగ్గి, కాగితాల వినియోగం పూర్తిగా తగ్గిపోనుంది.
Also Read
- Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
- Chandrababu Convoy: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లోకి కొత్త వాహనాలు.. రూ.1.78 కోట్లతో ఆరు వాహనాలు కొనుగోలు..
- AP Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తీవ్ర తుఫాన్‌గా మారనున్న 'అక్వాన్'..
- Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
నవంబర్ 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం కొనసాగనుంది. అమరావతిలోని ఏపీ శాసనసభ కమిటీ హాల్ నంబర్-2లో ఈ తరగతులను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విడతల వారీగా వివిధ శాఖల మంత్రుల పీఎస్‌లకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
షెడ్యూల్ ప్రకారం నవంబర్ 18వ తేదీన ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి విడత శిక్షణ జరుగుతుంది. ఈ మొదటి సెషన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రైవేట్ సెక్రటరీలతో పాటు వ్యవసాయం, ఐటీ, విద్య, మైనింగ్ శాఖల మంత్రుల పీఎస్‌లకు NeVA పోర్టల్ వినియోగంపై సాంకేతిక నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. మిగిలిన శాఖల మంత్రుల పీఎస్‌లకు తదుపరి విడతల్లో శిక్షణ ఇస్తారు. అసెంబ్లీ కార్యకలాపాలను ఆధునీకరించడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించనుంది.
తాజావార్తలు
-
AP Assembly: పేపర్‌లెస్ దిశగా ఏపీ అసెంబ్లీ.. మంత్రుల పీఎస్‌లకు ‘నేషనల్ ఈ-విధాన్’ (NeVA) శిక్షణ..
-
Singur Project: సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల.. రెండు గేట్లు ఎత్తిన అధికారులు
-
Giribabu: భయపెట్టే విలన్, నవ్వించే కమెడియన్.. గిరిబాబు జీవితంలోని ఆసక్తికర కోణాలివే!
-
Kajal Agarwal: ఆ రోజు నేనూ చనిపోవాల్సింది.. కానీ ఏదో అదృశ్య శక్తి నన్ను వెనక్కి లాగింది!
-
Giribabu: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!