Family Doctor: మార్చి 15 నుంచి పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Doctor: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. మార్చి 15వ తేదీ నుంచి ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. అదేరోజు ఒక విలేజ్ క్లినిక్ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.. 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామన్న అధికారులు. దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీనికోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపారు..
Read Also: Georgina Beyer: ప్రాణాలు విడిచిన తొలి ట్రాన్స్‌జెండర్ ఎంపీ..
Also Read
- OTR: మాజీ ఎమ్మెల్యే, మంత్రి మధ్య సమాధి రాజకీయం
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ఇక, ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను దీనికోసం నియమించుకున్నామని తెలిపారు అధికారులు. ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామన్నారు.. 10,032 విలేజ్‌హెల్త్ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్ఎం చొప్పున ఉంటారు. వీరితో పాటు ఒక సీహెచ్ఓ, 3–4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారు. విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామని వెల్లడించారు. అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపారు. మందులకు, డయాగ్నోస్టిక్.. తదితర వాటి సరఫరాకు అంతరాయం లేకుండా వాటిని స్టాకులో కూడా ఉంచుతున్నామని.. రోగులకు అదించే సేవలను రియల్‌టైంలో నమోదు చేయడానికి టూల్స్‌ను ఏర్పాటు చేశామని.. పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌కూడా పూర్తిచేశామన్నారు..
Read Also: Adimulapu Suresh: సీఎం జగనే బ్రాండ్ అంబాసిడర్.. జగన్ పాలనే మా పబ్లిసిటీ..
ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా వచ్చే 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అలాగే ప్రతిజిల్లాకు బ్యాక్అప్ కింద మరో 104 వాహనాన్నికూడా రిజర్వ్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి 4 గంటలవరకూ విలేజ్‌క్లినిక్‌లో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ఉండనున్నారు.. జనరల్ ఓపీ, నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్ మేనేజ్మెంట్, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్వాడీల సందర్శన, అందులో పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, వారి ఇళ్లకే వెళ్లి సేవలు అందించడం, పంచాయతీ కార్యదర్శితో కలిసి.. గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ.. ఈ విధులన్నింటినీ కూడా ఫ్యామిలీ డాక్టర్ నిర్వర్తిస్తారు. డిస్ట్రిక్‌హబ్స్‌లో ఉండే స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా టెలిమెడిసన్ పద్ధతుల్లోకూడా వీరికి సేవలందించేలా చూస్తారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్‌లాంటి నాన్‌కమ్యూనికబుల్‌డిసీజ్‌లతో బాధపడుతున్న వారి డేటా కూడా ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటుంది. ఫాలోఅప్ ట్రీట్మెంట్కోసం ఈ డేటాను వినియోగించనున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!