ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. నేడు ముహూర్తం బాగుండడంతో ఇవాళ స్వీకరించారు.
ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. రేపు సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇక, ఇప్పటి వరకు సీఎస్‌గా కొనసాగుతోన్న సమీర్ శర్మ.. రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.. ఇప్పటికే రెండుసార్లు పదవి పొడిగింపు పొందిన సమీర్ శర్మను వదులుకోవడానికి సిద్ధంగా లేరు సీఎం వైఎస్ జగన్.. దీంతో, 2023 నవంబర్ వరకు ఆయన పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రాన్ని మరోసారి కోరారు..…
ఉత్తరాంధ్రలో జవాద్ తుఫాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హోం మంత్రి మేకతోటి సుచరిత, ఇతర ఉన్నతస్థాయి అధికారులు హాజరయ్యారు. జగన్ మాట్లాడుతూ అధికారులకు సూచనలు చేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత…