ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో 74,453 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,169 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 53 మంది మరణించారు.. చిత్తూర్‌లో ఏడుగురు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాలో ఆరుగురు చొప్పు, కృష్ణా జిల్లా, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, అనంతపూర్, కడప, నెల్లూరులో నలుగురు చొప్పున, విశాఖపట్నం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, గుంటూరు, కర్నూల్, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు.. ఇక, గత 24 గంటల్లో 8,376 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,12,80,302 శాంపిల్స్ పరీక్షించారు… ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,54,457కు చేరగా.. రికవరీ కేసులు 17,88,161కు పెరిగాయి.. ఇప్పటి వరకు కోవిడ్‌తో మరణించినవారి సంఖ్య 12,416కు చేరగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 53,880గా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.