ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు…