YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఓవైపు సంక్షేమ పథకాలు అమలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు.. ఇక, రేపు ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించనున్నారు సీఎం జగన్.. ఈ పర్యటనలో భాగంగా వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మార్కాపురం పర్యటనకు రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్న ఆయన.. 9.55 గంటలకు మార్కాపురం చేరుకుంటారు. ముందుగా ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేస్తారు.. ఆ తర్వాత బటన్ నొక్కి.. ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తారు.. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు మార్కాపురం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.35 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఆర్ధికంగా వెనుకబడిన ఈబీసీ సామాజిక వర్గాలకు చెందినవారికి అండగా ఉంటుంది వైఎస్ జగన్ సర్కార్.. వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని రేపు విడుదల చేయనున్నారు సీఎం జగన్.. మార్కాపురంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున అందజేస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లలో రూ.30 వేలు ఆర్ధిక సాయం అందించింది జగన్ ప్రభుత్వం.. ఏటా రూ. 15,000 చొప్పున మూడేళ్లలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేస్తోంది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.