AP Cabinet Expansion: ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతోన్న వేళ.. ఆంధ్రప్రదేశ్లో మరో కీలకమైన చర్చ మొదలైంది.. అదే, ఏపీ కేబినెట్ విస్తరణ.. దీంతో, మంత్రులకు టెన్షన్ పట్టుకుందట.. నా పదవి ఉంటుందా? ఊడిపోతుందా? అనే లెక్కలు వేసుకుంటున్నారట మంత్రులు.. వైఎస్ జగ్మోహన్రెడ్డి తొలి కేబినెట్లో స్థానం సంపాదించుకున్న కొందరు మంత్రులను.. వైఎస్ జగన్ తన రెండో కేబినెట్లోనూ కొనసాగిస్తున్నారు.. కొందరి మార్చేసి.. కొత్తవారికి పదవులు కట్టబెట్టారు.. మాజీ మంత్రులకు పార్టీలో కీలక పోస్టులు ఇచ్చారు.. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ముగ్గురు, నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట.. వారి స్థానంలో కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ జోరుగా సాగుతోంది.. ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షల సందర్భంగా పనితీరు బాగలేని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్.. ఎవరు వెనకబడ్డారు.. ఎవరు పనితీరు మార్చుకోవాలి అనే విషయాలను కూడా సూటిగా చెప్పేశారు. దీంతో, ఈసారి కేబినెట్ పదవి కోల్పోయే మంత్రులు ఎవరు? అనే చర్చ మొదలైంది.
Read Also: SR Nagar Robbery: ఎస్ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసి వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇప్పుటికే రెండుసార్లు కేబినెట్ విస్తరణ జరిగింది.. తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్న మంత్రుల్లో ముగ్గురు, నలుగురు మినహా మిగిలిన వారందరికీ రెండో కేబినెట్లో అవకాశం రాలేదు.. అయితే, ఇప్పుడు మూడోసారి కూడా మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీలుగా విజయం సాధించినవారిలో ముగ్గురు, నలుగురిని తన కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఆలోచనగా ఉందట.. పార్టీ కోసం పని చేసి పదవులు రాని కొందరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి.. వారిని మంత్రులను చేయలనే యోచనలో జగన్మోహన్రెడ్డి ఉన్నారట. దానికి అనుగుణంగా ప్లాన్ చేస్తున్నారట.. ఎమ్మెల్సీ ఎన్నికలపై కసరత్తు చేస్తున్నారట.. పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించి.. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేశారట.. ఇందులో భాగంగానే సామాజిక వర్గాలుగా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. చాలాకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పెండింగ్లో ఉంది. ఇదే సమయంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చెప్పడంతో.. కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉంటుందనే చర్చ సాగుతోంది. కానీ, ఈ విస్తరణతో కేబినెట్లో ఉండేది ఎవరు? పదవులు ఊడేవి ఎవరివి అనేది ఆసక్తికరంగా మారింది.