Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లాలో మహేశ్వర్ రెడ్డి మృతి కేసు రాజకీయంగా మరింత హీట్ పెంచుతుంది.. ఈ కేసులో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం కోర్టు వద్దకు చేరుకున్న ఆయన, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మా అన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం శిఖండి రాజకీయాలు చేస్తోంది” అంటూ ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. తనకు ఎందుకు గన్‌మెన్‌ను తొలగించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహేశ్వర్ రెడ్డి మృతి ఘటనను మొదట పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారని.. కానీ, సంవత్సరం తర్వాత ఇప్పుడు కుట్రపూరితంగా కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. “చనిపోయిన వ్యక్తి మా బంధువే. అతను కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మేమే కాపాడాం.. ఇప్పుడు మాపైనే కేసులు పెట్టడం ఎక్కడి న్యాయం?” అని ప్రశ్నించారు ప్రకాష్ రెడ్డి.. తమ అనుచరులను తమపైనే రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. “ప్రకాష్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించాలనే కుట్ర జరుగుతోంది” అంటూ ఆరోపించారు.. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాలపై కూడా ఆయన స్పందించారు. “హనీ ట్రాప్ వ్యవహారంపై మేము మాట్లాడకూడదా? పాపంపేట భూకబ్జాలపై ప్రశ్నించకూడదా? మైనర్ బాలిక అత్యాచారం ఘటనపై ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్నారు” అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న అధికారులపై తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తప్పవని హెచ్చరించారు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి..
Also Read
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
కాగా, అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో జైపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత ఏడాది జనవరి 25న తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు సోమలదొడ్డి గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటనపై అప్పట్లో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే తన కుమారుడి మృతికి వైసీపీ నేతలే కారణమని మృతుడి తండ్రి మల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఇక, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆడియో, వీడియో రికార్డులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అక్కడి నుంచి వచ్చిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా అరెస్టులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇదే సాక్ష్యాధారాలతో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారించారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!