JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC vs Ketireddy: స్థానిక సంస్థల ఎన్నికలు అనంతపురం జిల్లాలో మరింత హీట్ పెంచుతున్నాయి.. ముఖ్యంగా తాడిపత్రి కేంద్రంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం నడుస్తోంది.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి రక్తం చూస్తేనే వెంకట్రామిరెడ్డి కిందపడిపోతాడని ఎద్దేవా చేశారు. తనను కేతిరెడ్డి గతంలో విమర్శించిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ చిన్నాన్న నడిచిన విధంగా నేను నడవలేనని నువ్వు మాట్లాడావని, ముందు నువ్వు నడిచి చూపించు.. ఆ తర్వాత నేను నడుస్తానని సవాల్ విసిరారు.
మీ కుటుంబంలోనే రక్త చరిత్ర ఉంది
రక్త చరిత్ర తమ కుటుంబంలో లేదని, కేతిరెడ్డి కుటుంబంలోనే ఉందని జేసీ వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి చిన్నాన్న పెద్దారెడ్డికి చదువు లేకపోవడం వల్లే ఊరును భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకైనా తెలుసా అని ప్రశ్నించారు. తమ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని పేర్కొన్నారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అక్రమాలు తమకు తెలియవా అని నిలదీశారు. గతంలో కేతిరెడ్డి చిన్నాన్న తమ ఇంటిపైకి రాలేదా? తన భార్య, కొడుకు, కోడలిపై కేసులు నమోదు చేయలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటిపైకి వచ్చినప్పుడు తమకు ఎంత ఆగ్రహం కలగాలని ప్రశ్నించారు. మీ చిన్నాన్న ఇల్లు కాలిందని అంత రోషం వచ్చిందా అంటూ విమర్శించారు.
Also Read
- Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
- JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు
- Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!
- AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది మీరే
ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసింది మీరేనని, ఇప్పుడు మళ్లీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని జేసీ మండిపడ్డారు. ధర్మవరాన్ని నాశనం చేశావని కేతిరెడ్డిపై విమర్శలు చేశారు. మీకు అంత ధైర్యం ఉంటే కేసులు ఎందుకు పెట్టించుకున్నారని ప్రశ్నించారు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని, సమయం చెప్పాలని సవాల్ విసిరారు. ఇక, తాడిపత్రి ఘటనలో పెట్రోల్ బాంబులు వేసింది తాము కాదని, మీ చిన్నాన్న తెల్ల బాంబులు వేశారని ఆరోపించారు. సచివాలయ ఉద్యోగులను పిలిపించి హర్షవర్ధన్ రెడ్డి కొట్టలేదా అని ప్రశ్నించారు. గతంలో గుడ్ మార్నింగ్ పేరుతో ప్రజల్లో తిరిగినా చివరకు ప్రజలు నిన్ను వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేష్ వల్లే మీరు బాగున్నారు
మీ చిన్నాన్న ఇంటిలోకి మీ అమ్మ కూడా వెళ్లదని, అలాంటిది నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావని జేసీ వ్యాఖ్యానించారు. తాను చనిపోతే తన కోసం పదిమంది ఏడవాలని కోరుకుంటూ జీవిస్తున్నానని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వల్లే మీరు బాగున్నారని వ్యాఖ్యానించారు. వారు తమను నియంత్రించడం వల్లే మీరు ఊర్లలో ఉండగలుగుతున్నారని అన్నారు. గతంలో తమ పొట్టి రవిని ఐదేళ్లపాటు ఊరు బహిష్కరించలేదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు మీ చిన్నాన్నను ఇప్పుడు తాడిపత్రి నుంచి ఎందుకు బహిష్కరించకూడదని నిలదీశారు. అయితే, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
JC vs Ketireddy: కోడి రక్తం చూస్తేనే కిందపడిపోతావు..! కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ఫైర్
-
Motorola G Max: రూ.19,499కే Motorola G Max 5G ఫోన్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదిరిపోయే డీల్!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Krithi Shetty: ‘జనవరి 12 విడుదల’.. హిట్ తప్పనిసరి!
-
December 2026 Wedding Dates: డిసెంబర్లో పెళ్లి బాజాలు మోగేది ఈ తేదీల్లోనే.. 16 నుంచి శుభకార్యాలకు బ్రేక్
ట్రెండింగ్
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ