Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు.