Home Minister Vangalapudi Anitha: అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం.. నిందితుల్లో ముగ్గరు మైనర్లు..
- శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం..
- 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం.. మరొకరు పరారీ..
- మీడియాకు వెల్లడించిన హోంశాఖ మంత్రి అనిత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Minister Vangalapudi Anitha: శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం కేసు సంచలనం సృష్టించింది.. వలస వచ్చిన ఓ ఫ్యామిలీపై దాడి చేసిన దుండగులు.. అర్ధరాత్రి సమయంలో అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేపు చేసిన ఘటన కలకలం సృష్టించగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. ఘటన జరిగిన 48 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ కేసుపై మీడియాతో మాట్లాడిన ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. సత్యసాయి జిల్లాల్లో అత్తా కోడళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో 48 గంటల్లో నిందితులను పోలీసులు పట్టుకున్నారని తెలిపారు.. సీఎం చంద్రబాబు ఆదేశాలు మేరకు ఈ ఘటనలో నిందితులకు వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.. దీనిపై విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు.
Read Also: SDT18: సాయి దుర్గ్ తేజ్18 బర్త్ డే గ్లింప్స్ అదరహో..
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
ఇక, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతున్నాం అన్నారు మంత్రి అనిత.. ఇళ్ల వద్ద వ్యాపార వాణిజ్య, సముదాయాల వద్ద పెట్టుకున్న సీసీ కెమెరాలను పోలీసు శాఖకు అనుసంధానం చేస్తే నేర నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు.. పోలీసులకు ఆయుధాల్లాగే ప్రజలకు మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి.. వాటిని వినియోగించి నేర నియంత్రణకు సహకరించాలన్నారు.. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే సత్యసాయి జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో అత్యంత వేగంగా విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు కేసును అప్పగించాం అన్నారు.
Read Also: AP Incharge Ministers: జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రుల నియామకం.. పవన్ కల్యాణ్, లోకేష్‌కు నో ఛాన్స్..!
ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం.. దొరికిన ఐదుగురు నిందితుల్లో ఒకరిపై 37 కేసులు ఉన్నాయని.. 37 కేసులున్న వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు.. అందుకే త్వరితగతిన విచారణకు ప్రత్యేక కోర్టుకు అప్పగిస్తున్నాం అన్నారు హోంశాఖ మంత్రి అనిత.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు హోంమంత్రి అనిత.. కాగా, రాష్ట్రంలో సంచలనం రేపిన సామూహిక ఆత్యాచార కేసులో నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ నెల 12 అర్ధరాత్రి చిలమత్తూరు మండలంలో అత్తా కోడళ్లపై సామూహిక ఆత్యాచారం జరిగింది.. ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.. అయితే, నిందితుల్లో ముగ్గరు మైనర్లుగా పోలీసులు గుర్తించారు. బళ్లారి ప్రాంతం నుంచి ఉపాధి కోసం వచ్చిన కుటుంబంపై.. అర్ధరాత్రి సమయంలో బైక్ లపై వచ్చిన ఆరుగురు దుండగులు.. తండ్రి, కొడుకుపై దాడి చేసి.. అత్తా కోడళ్లపై అత్యాచారం చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపగా.. సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. నిందితులను 48 గంటల్లోపు అరెస్ట్ చేసింది..
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్‌లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!