అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం జగన్ సంతకాలు చేశారు. బాలమృతం, అంగన్‌వాడీ పిల్లలకు పాల సరఫరాపై అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు అని వెల్లడించారు. ప్రైవేట్ డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు…
నేడు కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల స్థిరీకరణతో ప్రభుత్వం మార్కెట్లోకి ప్రవేశించి రైతులకు మంచి ధరలు ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. దీనివల్ల వ్యాపారులు కూడా మంచి ధరలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని, నిర్ణయించిన ధరకు లేక అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధిద్వారా రైతులకు తోడుగా నిలవగలిగామని ఆయన వెల్లడించారు.…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో వర్చువల్ విధానంలో పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకం అమలు కానుంది. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన లాభాలు వస్తాయని ఇప్పటికే జగన్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
గత టీడీపీ ప్రభుత్వం, హెరిటేజ్‌పై విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.. జగనన్న పాలవెల్లువ, మత్స్యశాఖలపై సమీక్ష నిర్వహించారు సీఎం.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం– కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ- శిక్షణా కరదీపిక పుస్తకాలను ఆవిష్కరించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని.. కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని ఆరోపించారు.. సహకార…