Media and Entertainment Skills Council Training: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఆర్థిక సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) ప్రమోట్ చేస్తున్న మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ప్రొడ్యూసర్ బజార్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలోనే సినిమా ఫీల్డ్‌లో అసిస్టెంట్లకు శిక్షణను అందిస్తోంది. సినిమా పరిశ్రమ చాలావరకు అసంఘటితంగా ఉండడంతో అసిస్టెంట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ కెమెరాపర్సన్లు, అసిస్టెంట్ ఎడిటర్లు వంటి వారు తగిన గుర్తింపు దక్కించుకోలేక పోవడమే కాక ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. ఉదాహరణకు, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని కుంగదీసినప్పుడు, ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు సాయం అందుకోలేకపోయారు.
Raj Tarun – Malvi : ఎట్టకేలకు మీడియా ముందుకు రాజ్ తరుణ్?
ఈ క్రమంలో వారికి ఒక గుర్తింపు అందించేలా షార్ట్ టైమ్ సర్టిఫికేట్ కోర్సు వారి సంబంధిత రంగంలో అధికారిక శిక్షణను అందిస్తుంది, అంతేకాకుండా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్స్ కౌన్సిల్ వంటి గుర్తింపు పొందిన సంస్థతో వారి వివరాలను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ శిక్షణ వారిని సర్టిఫైడ్ ప్రొఫెషనల్‌గా మార్చి వివిధ పథకాల నుండి ప్రయోజనం పొందేందుకు వారిని అర్హులుగా చేస్తుంది. ఈ శిక్షణ త్వరలో ప్రారంభమవుతుందని, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలలోని కార్మికుల కోసం ఈ కోర్సు ఎంటర్ టైన్మెంట్ రంగంలోని వివిధ సహాయకులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం అని అంటున్నారు నిర్వాహకులు.