Atreyapuram: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాజావరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సడెన్ గా తనిఖీలు చేయడంతో రెండు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొత్తపేట డిఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తో పాటు మరో 25 మంది పోలీసులు ఈరోజు ఉదయం నుంచి ఈ సోదాలు చేపట్టారు.
Read Also: Maruti Suzuki Alto K10: డోంట్ మిస్.. ఆల్టో K10పై ఏకంగా 71,960 వరకు భారీ డిస్కౌంట్!
అయితే, ఈ తనిఖీల్లో రికార్డు లేని 20 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి తగిన ఆధారాలు చూపిస్తే.. తిరిగి ఇచ్చేస్తామని రూరల్ సీఐ పేర్కొన్నారు. అలాగే, రాజావరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు. మారుమూల గ్రామాల్లో సారాయి, గంజాయి లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటడంతోనే.. ఈ సోదాలు చేపట్టినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ తనిఖీలలో ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమూరు పోలీసులు పాల్గొన్నారు.