రాజావరంలో ఓ మహిళ 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట కలిగి ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. వీటితో పాటు డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్ లను స్వాధీనం చేసుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ నెయ్యేనని నిర్ధారణ అయింది. హైదరాబాద్‌కు పంపిన శాంపిల్స్ ల్యాబ్ పరిశీలనలో వాస్తవాలు వెల్లడయ్యాయి. దాంతో ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో నాణ్యతలేని వెయ్యి వాడుతున్నట్లు తేలిపోయింది. గత నెల ఆహార భద్రత అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో లూజు నెయ్యి ప్యాకెట్లు, బ్రాండ్ లేని నెయ్యి నమూనాలను గుర్తించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలన్న అత్యాశలతో కొందరు నాణ్యత లేని నెయ్యి వాడుతున్నట్లు…
మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి.
మరో అదురైన గుర్తింపును సొంతం చేసుకుంది మన ఆత్రేయపురం పూతరేకు.. భౌగోళిక గుర్తింపుతో అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిటీతో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేర్చింది..
అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్‌లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది.…