Amaravati Arasavalli Yatra: జోరువానలోనూ అమరావతి పాదయాత్ర హోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి నుండి అరసవల్లి.. అమరావతి రైతుల మహా పాదయాత్ర జోరుగా సాగుతోంది. 28 వ రోజు జోరువాన సైతం లెక్క చేయకుండా రైతులు యాత్రలో పాల్గొంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, జిన్నూరు,వేడంగి మీదుగా ఆచంట నియోజకవర్గం చేరుకొంది పాదయాత్ర. ఈసందర్భంగా అమరావతి రైతులకు పువ్వులు, హారతులతో నీరాజనం పలికి రోడ్డుపై మోకరిల్లి స్వాగతం పలికారు మహిళలు.
Read Also: Sister Sacrifice: చెరువులో మునిగిపోయిన చెల్లిని కాపాడి.. అక్క ప్రాణ త్యాగం
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా సంఘీభావం తెలుపుతూ టీడీపీ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పీతల సుజాత, జవహర్, నిమ్మల రామానాయుడు, అంగర రామ్మోహన్ రావు, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, టీడీపీ నేతలు, జనసేన పీఏసీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ జనసైనికులు, బీజేపీ, సీపీఐ, సీపీఎం ,దళిత సంఘ నాయకులు..రైతులు వామపక్ష నేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ రోజు కవిటం,జగన్నాథ పురం, మార్టేరు, పెనుగొండ వరకు 10 కిలోమీటర్ల మేర రైతుల మహాపాదయాత్ర సాగనుంది. వందలాదిగా తరలివచ్చిన వీరమహిళలు,రైతులు ,అభిమానులు అమరావతి రైతులకు అండగా బ్రహ్మరథం పట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు, వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
Read Also: Mulayam Singh Yadav: ములాయం ఆరోగ్యం మరింత విషమం.. ఐసీయూలో చికిత్స
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!