CM Chandrababu : ఏపీలో మెగా స్టీల్ సిటీ.. రూ.1.36 లక్షల కోట్ల భారీ ప్రాజెక్ట్
- రూ.1.36 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం
- నక్కపల్లిలో ‘స్టీల్ సిటీ’గా అభివృద్ధి లక్ష్యం
- రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి టార్గెట్
- వేలాది ఉద్యోగాలు.. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో భారీ ఉక్కు పరిశ్రమకు అంకురార్పణ జరిగింది. సుమారు 1.36 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు హెచ్.డి. కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ , మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు కాబోతున్నది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదని, ఇది ఒక సంపూర్ణ ‘స్టీల్ సిటీ’గా అవతరించబోతోందని ప్రకటించారు. గతంలో విశాఖ ఉక్కును పోరాడి సాధించుకుంటే, ఆర్సెలార్ మిట్టల్ సంస్థ మన రాష్ట్రంపై ఉన్న నమ్మకంతో ఇక్కడికి రావడం విశేషమని, కేవలం 20 నెలల కాలంలోనే ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో ఈ మెగా ప్రాజెక్టును సాకారం చేసి చూపించామని ఆయన గర్వంగా పేర్కొన్నారు.
Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లాంట్‌తో పాటు సుమారు 11,198 కోట్లతో ప్రత్యేక క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం కానుంది. పరిశ్రమకు అవసరమైన ముడి ఇనుము సరఫరా కోసం ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తిని ప్రారంభించి, 2030 డిసెంబర్ నాటికి రెండు భారీ బ్లాస్ట్ ఫర్నేస్‌లను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భారీ పరిశ్రమ కేవలం ఉక్కు ఉత్పత్తికి మాత్రమే పరిమితం కాకుండా, ఆర్థిక లావాదేవీలతో పాటు విద్య, వైద్యం , వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా ఈ ప్రాంత రూపురేఖలను మార్చివేస్తుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అత్యంత వేగంగా భూసేకరణ , అనుమతులు ఇచ్చింది ఏపీలోనేనని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఆయన స్పష్టం చేశారు.
Chirag Paswan: బీహార్ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం ఉందని, నిపుణులు , మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతమని చంద్రబాబు పేర్కొన్నారు. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకు అన్నింటికీ ఇక్కడ మెండైన అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ అనే నినాదాన్ని విజయవంతం చేస్తామని, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావడం రాష్ట్రానికి గర్వకారణమని, బీపీసీఎల్ వంటి పెద్ద పరిశ్రమలు కూడా ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో రాష్ట్రానికి సుమారు 20.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ , ఐటీ సెంటర్లకు కీలక కేంద్రంగా మారుతుందని వివరించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, ఈ ప్రాంతం త్వరలోనే రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తామని, కొత్తగా పోర్టులు , విమానాశ్రయాలు వస్తున్నాయని, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రకాల సహకారం అందిస్తామని, భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరిశ్రమలో మొదటి ప్రాధాన్యతగా అనకాపల్లి జిల్లా యువతకే ఉద్యోగాలు కల్పించాలని సంస్థను కోరారు. ఆవిష్కరణల కోసం మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు సంస్థ ప్రతినిధులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..