Jagan Convoy Accident: జగన్ కాన్వాయ్ ప్రమాద ఘటనపై టీడీపీ తప్పుడు ప్రచారం.. వైసీపీ ఫైర్!
- జగన్ కాన్వాయ్ ఘటనపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయిస్తుంది..
- రాజకీయ కుట్ర కోసమే టీడీపీ పార్టీ ఈ వీడియోను ఉపయోగిస్తుందని ఆరోపణలు..
- వైరల్ వీడియో వెనుక టీడీపీ పార్టీ రాజకీయ ఎజెండా ఉంది: వైసీపీ సోషల్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagan Convoy Accident: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రమాద వీడియోపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చి రాజకీయ కుట్ర కోసం ఉపయోగిస్తున్నట్లు ఎన్డీయే కూటమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించింది ఎక్స్ వేదికగా. రాష్ట్రంలో పాలన, ప్రజా సంక్షేమం పట్ల కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది.. అందుకే, ఈ వీడియోను వైరల్ చేస్తూ.. ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్స్ పొలిటిక్స్ కు పాల్పడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా పేర్కొనింది.
Read Also: Vijay Deverakonda: నా వ్యాఖ్యల వల్ల బాధ కలిగితే క్షమించండి.. క్లారిటీ ఇచ్చిన హీరో..!
Also Read
- Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్..
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలకు వచ్చిన భారీ ప్రజా స్పందనను రావటాన్ని చూసి కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది అని వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపించింది. వైసీపీ నాయకులను వేధించడం, తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది. జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సమయంలో సింగయ్య అనే వ్యక్తి మరణం దురదృష్టకరం.. ఈ ఘటనపై మానవత్వంతో వ్యవహరించాల్సింది పోయి రాజకీయం చేస్తున్నారు.. అత్యంత బాధాకర రీతిలో తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని పేర్కొనింది. ఈ విషయం తెలిసిన తర్వాత రోజు మాజీమంత్రి అంబటి రాంబాబు వ్యక్తిగతంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. వారి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయ చెక్కును కూడా అందజేశారని వెల్లడించింది.
Read Also: US Iran Conflict: ఇరాన్ ప్రతిదాడులకు దిగితే, మేం గట్టిగా జవాబిస్తాం..
కానీ, ప్రమాదానికి కారణమైన వాహనం జగన్ కాన్వాయ్‌లో వాహనం కాదని, ఓ ప్రైవేట్ వాహనం అని పల్నాడు జిల్లా ఎస్పీ స్పష్టంగా తెలిపారు. సంబంధిత వాహన డ్రైవర్, యజమానిని గుర్తించి విచారించారు.. ఈ ప్రమాదానికి కాన్వాయ్‌తో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించారు.. ఇన్ని వాస్తవాలు ఉన్నప్పటికీ సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత కూటమి సర్కార్ జగన్ తప్పు అన్నట్లుగా ఒక వీడియోను విడుదల చేసిందని వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ మండిపడ్డారు. ఈరోజు వైరల్ అయిన వీడియోలో కాన్వాయ్ చుట్టూ పెద్ద సంఖ్యలో జనం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.. ఆ ప్రమాదం జరిగిందని జగన్ కు తెలియదు.. జెడ్ ప్లస్ లో ఉన్న జగన్ కు కనీసం రోప్ పార్టీ, రోడ్ క్లియరెన్స్ బృందం కాన్వాయ్‌కు కేటాయించాలి.. ప్రస్తుత ప్రభుత్వం తగిన భద్రత కల్పించడంలో విఫలమైంది.. ఫలితంగా పదేపదే లోపాలు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నీతి, నిజాయితీ, బాధ్యతాయుతమైన రాజకీయాలకు వైసీపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
YSRCP condemns malicious political conspiracy over Palnadu Accident
Tadepalli, June 22:
The YSR Congress Party strongly condemns the ongoing political conspiracy by the TDP coalition in Andhra Pradesh, which continues to resort to diversionary tactics, sensationalism, and smear…— YSR Congress Party (@YSRCParty) June 22, 2025
తాజావార్తలు
-
Pawan Kalyan: అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు.. మరోసారి తెలంగాణ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్..
-
Vijay Antony: సీఎం విజయ్‌ని కలిసిన ‘బిచ్చగాడు’ హీరో.. నెట్టింట వైరల్‌గా మారిన ఫోటోలు!
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!