MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఒక ఉగ్రవాదలా నన్ను జైల్లో పెట్టారని మండిపడ్డారు.. రెండున్నర నెలల ఒక ఖైదీగా ఉండాల్సిన వచ్చింది.. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షలు మేరకు కేసు గురించి ఎక్కవగా మాట్లాడ కూడదన్న ఆయన.. గతంలో చాలా సార్లు చెప్పాను.. ఎన్ని ఇబ్బందులు పెట్టిన అధైర్యపడే పరిస్థితి ఉండదు అని స్పష్టం చేశారు..
Read Also: Tollywood : సినిమాల రిలీజ్ ను డిసైడ్ చేస్తున్న ఓటీటీ.. స్టార్ హీరో సినిమా రైట్స్ ఇప్పటికి పెండింగ్
గత 2014లో కేసు పెట్టి జైల్లో పెట్టారు.. అప్పుడు చెప్పాను.. తప్పుడు కేసు అని.. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న మమ్మల్ని వేధించడం మామూలే అన్నారు మిథున్‌రెడ్డి.. కష్టకాలంలో అండగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. లిక్కర్ కేసు పెట్టి పైశాచిక ఆనందం, తల్లిదండ్రులు బాధ పెట్టడం తప్ప వాళ్లు ఏమీ సాధించలేదు అన్నారు.. కేసులు పెట్టినా.. ఏమి చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు.. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్తా అన్నారు మిథున్ రెడ్డి.. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి.. డైవర్షన్ చేయడంలో భాగంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.. ఇక, బీజేపీలోకి వెళ్తామన్న ప్రచారంలో అర్థం లేదన్నారు.. ఇవన్ని టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంగా కొట్టిపారేశారు.. జైల్లో ఇబ్బందులు పెట్టారు.. సీసీ కెమెరా పెట్టి విజయవాడ నుండి చూసేలా ఏర్పాట్లు చేశారని ఆరోపించారు.. ఒక ఉగ్రవాదిలా నన్ను జైల్లో పెట్టారు.. కోర్టు చెప్పిన అదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి..