YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Candidates List: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు చూపిస్తోంది.. కూటమిలో సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకోగా.. ముందుడుగు వేస్తూ పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సంబంధించి చైర్మన్, మేయర్ అభ్యర్థులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల వారీగా ప్రకటించిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్ల అభ్యర్థులు
వైసీపీ ప్రకటించిన కార్పొరేషన్ అభ్యర్థుల్లో విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, ఏలూరు నుంచి గంటా మోహన్రావు, మచిలీపట్నం నుంచి లంకా జ్యోతి, కడప నుంచి దీప్తి రెడ్డి ఉన్నారు. కర్నూలు నుంచి ఎం. సుశీల, నెల్లూరు నుంచి ఆనం విజయ్కుమార్రెడ్డి, ఒంగోలు నుంచి కుప్పం ప్రసాద్, విజయనగరం నుంచి కోలగట్ల శ్రావణిని అభ్యర్థులుగా ప్రకటించింది వైసీపీ..
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
మున్సిపాలిటీల అభ్యర్థులు
మున్సిపాలిటీలకు సంబంధించి ఇచ్ఛాపురం నుంచి పిలక రాజ్యలక్ష్మి, పలాస నుంచి శ్రీపద్మ, నర్సీపట్నం నుంచి చింతకాయల అనిత, యలమంచిలి నుంచి బుడ్డపు తులసి, తుని నుంచి రామతులసిని వైసీపీ ప్రకటించింది. కొవ్వూరు నుంచి మన్నే పద్మ, రామచంద్రాపురం నుంచి చింతపల్లి నాగేశ్వరరావు, కొండపల్లి నుంచి నల్లమోతు తేజస్వి, తెనాలి నుంచి మద్దాలి శేషాచలం, చీరాల నుంచి ఇస్తర్ల షేర్లీ పేర్లను వెల్లడించింది. అలాగే బద్వేలు నుంచి రాచపూడి వెంకట సాయికృష్ణ, ప్రొద్దుటూరు నుంచి పొర్రెడ్డి నరసింహారెడ్డి, పులివెందుల నుంచి వైఎస్ ప్రమీలమ్మ, మదనపల్లి నుంచి జింకా చలపతిని అభ్యర్థులుగా ప్రకటించింది.
నగర పంచాయతీల అభ్యర్థులు
నగర పంచాయతీలకు సంబంధించి ఏలేశ్వరం నుంచి బాదిరెడ్డి ఆశాలత, ఉయ్యూరు నుంచి పైడిముక్కల దివ్య, గురజాల నుంచి పోలు వీరారెడ్డి, కనిగిరి నుంచి పులి శాంతిరెడ్డిని వైసీపీ ఎంపిక చేసింది. బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ షకీలా బేగం, కమలాపురం నుంచి మర్జుల కవిత పేర్లను ప్రకటించింది. మొత్తంగా ఈ ప్రకటనతో రాష్ట్రంలోని పలు పట్టణాల్లో వైసీపీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు వెల్లడయ్యాయి. ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల ప్రచారంపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
-
CM Revanth Reddy : ఎండల సెగ.. నీటి కష్టాలు.? రైతులకు సీఎం అలర్ట్
-
YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!