YS Jagan: కూటమి సర్కార్‌పై జగన్ ఫైర్.. 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులుగా..!
- ఎక్స్ వేదికగా చంద్రబాబు సర్కార్ పై వైఎస్ జగన్ ఫైర్..
- 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులగా చంద్రబాబు పాలన..
- ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై సోషల్‌మీడియా వేదికగా ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని దుయ్యబట్టారు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్.. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా పేర్కొన్నారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం అన్నారు..
Read Also: Story board: అంతా రైతు సంక్షేమం గురించి మాట్లాడేవారే.. ఆదుకునే వారు మాత్రం లేరు..!
Also Read
రెడ్‌బుక్ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు.. ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు జగన్.. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించారు.. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి.. దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇదని పేర్కొన్నారు.. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి..
.@ncbn గారి దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వయోవృద్ధురాలైన ఆయన… pic.twitter.com/arTHH9lwhE
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 9, 2025
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!