YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: ఈ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని జగన్ ఆరోపించారు. తన రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందుకే దాడులు, అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హింసాత్మక రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేమీ కాదని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్‌లా మార్చేశారని ఆరోపించారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డికే భద్రత లేని పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో దాడులు జరుగుతున్నప్పటికీ పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోతోందని జగన్ ఆరోపించారు. ఈ అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. న్యాయపరంగా, చట్టపరంగా అన్ని మార్గాల్లో పోరాటం చేస్తామని తెలిపారు. ధైర్యంగా, సహనంతో ఎన్నికలను ఎదుర్కొంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తామని జగన్ వెల్లడించారు. ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పారామిలటరీ బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని కూడా కోర్టుల ముందు ఉంచుతామని చెప్పారు. ప్రజలకు మంచి చేసిన చరిత్ర తమదని జగన్ పేర్కొన్నారు. హింసాత్మక రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఎన్నికల సమయంలో దాడులు, అక్రమాలకు తావులేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
Also Read
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!