Deputy CM Pawan Kalyan: హిందూ సంప్రదాయాలపై వచ్చే తీర్పుల్లో ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నను లేవనెత్తారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శబరిమల తీర్పుతో శతాబ్దాల సంప్రదాయం మారినా.. ఆ సమయంలో ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన కోరలేదని పవన్ గుర్తు చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి హిందూ భక్తులను అవమానించేలా మాట్లాడినా.. అతనిపై కూడా ఎలాంటి చర్యలు జరగలేదని స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం.. శతాబ్దాలుగా కొనసాగుతున్న కార్తీక దీపం సంప్రదాయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చినందుకు ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని లక్ష్యంగా చేసుకోవడం ఏ న్యాయబద్ధం? అని పవన్ ప్రశ్నిస్తున్నారు.
Read Also: మినీ థియేటర్ మీ ఇంట్లోనే.. తక్కువ బడ్జెట్‌లో Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV
DMK నేతృత్వంలో INDIA బ్లాక్ 120 మంది ఎంపీలు అభిశంసన నోటీసు ఇవ్వడం న్యాయపరమైనది కాదు అని పేర్కొన్నారు పవన్ కల్యాణ్.. ఇదొక రాజకీయ బెదిరింపే అని ఆరోపించారు.. హిందూ ఆచారాలను కాపాడే తీర్పులు ఇస్తే న్యాయమూర్తులను టార్గెట్ చేయడం.. న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమని పవన్ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులు తమ మత వ్యవహారాలను రాజకీయ జోక్యం లేకుండా నిర్వహించేందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు అవసరం తప్పనిసరి అయిందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం కూడా రాజ్యాంగం ఇచ్చిన మౌలిక హక్కే.. సెక్యులరిజం ఒకవైపే నడిస్తే అది సెక్యులరిజం కాదని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్..
సూడో సెక్యులరిజం పేరుతో న్యాయవ్యవస్థను బెదిరిస్తారా?
రాజ్యాంగబద్ధమైన సుప్రీం కోర్టు ధర్మాసనం శబరిమల అంశంపై శతాబ్దాలుగా కొనసాగుతున్న ఒక పవిత్రమైన ఆచారాన్ని రద్దు చేస్తూ తీర్పు ఇస్తే, దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున నిరసనలను తెలిపారు కానీ ఎవరూ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం… https://t.co/Ua82qKcM1p
— JanaSena Party (@JanaSenaParty) December 9, 2025