Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV: ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఒనిడా వినియోగదారుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన 55 ఇంచుల 4K Ultra HD స్మార్ట్ LED Google TV (మోడల్ 55UZI)ను మార్కెట్‌లో అందిస్తోంది. నెక్స్జీ సిరీస్‌లో విడుదలైన ఈ టీవీ ప్రీమియం ఫీచర్లు, ఆధునిక డిజైన్, శక్తివంతమైన ఆడియో పనితీరుతో ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా ధర పరంగా కూడా ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్‌గా మారింది. మినీ థియేటర్ అనుభవం మీ ఇంట్లోనే పొందాలని అనుకుంటున్న వీళ్లు దీనిపై ఒక లుక్ వేయాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ తర్వాత పవన్ సినిమా ఏంటి?
ధర & ఆఫర్లు
ఈ ఒనిడా Nexg 55UZI TV మార్కెట్ ధర రూ.42,990 కాగా, ప్రస్తుతం Amazonలో 35% డిస్కౌంట్‌తో రూ.27,999కే అందుబాటులో ఉంది. అదనంగా
* SBI క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ఆప్షన్ రూ.1,364/నెల
* HDFC బ్యాంక్ కార్డ్ EMI పై ప్రత్యేక రూ.750 తక్షణ డిస్కౌంట్
* Amazon Pay ICICI బ్యాంక్ కార్డ్‌తో Prime సభ్యులకు 5% క్యాష్‌బ్యాక్
ఈ టీవీ ధర పరంగా, ఫీచర్ల పరంగా బడ్జెట్‌లో ప్రీమియం అనుభవం కోరుకునే వినియోగదారులకు మంచి ఎంపికగా నిలుస్తోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ
ఈ మోడల్‌లో 55 ఇంచుల LED ప్యానెల్‌తో 4K అల్ట్రా HD రిజల్యూషన్ వస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్, 1200:1 కాంట్రాస్ట్ రేషియో, HDR10 సపోర్ట్ ఉండటంతో సినిమా ప్రేమికులకు, గేమింగ్ యూజర్లకు అద్భుతమైన విజువల్ అనుభవం లభిస్తుంది. Pixa Visual Engine, Eye Protect Plus టెక్నాలజీలు కళ్లపై ఒత్తిడిని తగ్గించి మరింత సహజమైన రంగులను అందిస్తాయి. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కారణంగా ఏ కోణంలో చూసినా స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది.
సౌండ్, స్మార్ట్ ఫీచర్లు
ఈ టీవీలో 20W స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్, సౌండ్ ఈక్వలైజర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సినిమాలు, మ్యూజిక్, గేమింగ్ ఏది చూసినా థియేటర్ లాంటి సౌండ్ ఇమర్షన్ పొందవచ్చు. గూగుల్ TV ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ టీవీ, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ క్యాస్ట్ వంటి అన్ని ఆధునిక స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే Netflix, Amazon Prime Video, Disney+ Hotstar, Sony Liv, Zee5, Jio Cinema, MX Player, YouTube వంటి ప్రముఖ OTT యాప్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
కనెక్టివిటీ, డిజైన్, నిర్మాణం
ఈ టీవీ 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు, Bluetooth 5.1, Wi-Fi కనెక్టివిటీతో వస్తుంది. గేమింగ్ కన్సోల్, సౌండ్‌బార్, సెటాప్ బాక్స్, పెన్‌డ్రైవ్ వంటి పరికరాలను సులభంగా కనెక్ట్ చేయవచ్చు. ఫ్లాట్ స్క్రీన్ ఫినిష్, సన్నని బెజెల్స్, 200×200 mm VESA మౌంట్ సపోర్ట్‌తో ఇది వాల్ మౌంట్, టేబుల్ మౌంట్ రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. బరువు కూడా కేవలం 11.7 కిలోలే కావడంతో సులభంగా ఇన్‌స్టాల్ చేయవచ్చు.
పనితీరు, పవర్
16 GB స్టోరేజ్, స్మూత్ యూజర్ ఇంటర్‌ఫేస్, వేగవంతమైన రెస్పాన్స్ టైం (9 ms) కారణంగా యాప్ నావిగేషన్, స్ట్రీమింగ్ అనుభవం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. పవర్ కన్జంప్షన్ 100W మాత్రమే. డిస్‌ప్లే క్వాలిటీ, స్మార్ట్ ఫీచర్లు, శక్తివంతమైన ఆడియో, స్టర్డీ డిజైన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే Onida Nexg 55 ఇంచుల 4K Google TV ఈ కేటగిరీలో ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్‌గా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. లోబడ్జెట్ ప్రీమియం అనుభవం కావాలనుకునే కుటుంబాల కోసం ఇది సరైన ఎంపికగా ఉంటుందని పేర్కొన్నారు.
READ ALSO: Saudi Arabia: సౌదీలో నాన్-ముస్లింలకు ‘‘మద్యం’’.. కానీ, ఒక్క కండిషన్..