Vishnuvardhan Reddy: గద్దర్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. పద్మ పురస్కారం ఎలా ఇస్తారు..?
- గద్దర్‌పై బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు..
- ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చిన విష్ణు..
- గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ఎలా లేఖ రాస్తారు..
- భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్..
- గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnuvardhan Reddy: ప్రజాయుద్ధనౌక గద్దర్‌కు పద్మ పురస్కారం ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే.. నక్సలైట్లతో కలిసి ఎంతో మందిని గద్దర్ హత్య చేయించారు. అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
Read Also: MP Ayodhya Rami Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి..
Also Read
- CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Polavaram-Banakacherla: పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం బ్రేక్.. ప్రతిపాదన వెనక్కి
- Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
అనేక మంది పోలీసులను చంపిన కేసులో కోర్టులకు తీరగలేనని రాష్ట్రపతికి గద్దర్ లేఖ రాసుకున్నారు.. గద్దర్ మావోయిస్టు లీడర్.. గద్దర్ కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి గద్దర్ కు పద్మ పురస్కారం ఇవ్వాలా? అంటూ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు విష్ణువర్ధన్‌రెడ్డి.. ఇక, రాజీవ్‌గాంధీని చంపిన వారికి రేవంత్ పద్మ పురస్కారం ఇవ్వమంటారా? అని నిలదీశారు.. గద్దర్ కి LTT తీవ్రవాదులకు తేడా లేదన్న ఆయన.. మాజీ మావోయిస్టు ,రాజ్యాంగం వ్యతిరేకించిన వ్యక్తికి ఏ హోదా లో రేవంత్ రెడ్డి పద్మ అవార్డు అడుగుతున్నారు.. ఉగ్రవాదులకు కూడా రేవంత్ పద్మ అవార్డులు అడుగుతారా అని ప్రశ్నించారు.. గద్దర్ ను మావోయిస్టు అని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ.. గద్దర్ ను చంపడానికి ప్రయత్నించింది కాంగ్రెస్ పార్టీ.. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి పద్మ అవార్డుల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.. పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియ కూడా తెలియని వాళ్లు రేవంత్ కి సలహాలు ఇస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు.. పబ్లిక్ డొమైన్ లో ఓటింగ్ ద్వారా కూడా పద్మ పురస్కారాలు ఇస్తారు.. దరఖాస్తులు చేయని మొగలయ్యకు పద్మ శ్రీ ఇచ్చారు.. భారత ప్రభుత్వం గుర్తించి రామయ్య పద్మ అవార్డు అందించిందని చెప్పుకొచ్చారు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.
తాజావార్తలు
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!