రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది పాలనలో ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. ఇక, ప్రజల తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే, జిల్లా కలెక్టర్లకు, నియోజకవర్గ స్ధాయి అధికారులకు మెమోరాండం సమర్పించాలని సూచించారు.