Sajjala Ramakkrishna Reddy: తప్పుడు కేసులతో భయపడేది లేదు.. లుకౌట్ నోటీసులపై..!
- లుకౌట్ నోటీసులపై స్పందించిన సజ్జల రామకృష్ణా రెడ్డి
- విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు
- తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారు
- కుటుంబంతో ఈ నెల 7న ఢిల్లీ నుంచి వెళ్ళాను- సజ్జల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లుకౌట్ నోటీసులపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. విదేశాల నుంచి వస్తుంటే ఏపీ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారని అసత్య ప్రచారం చేస్తున్నారు.. తప్పు చేసి నేను తప్పించుకునే ప్రయత్నం చేశారని పైత్యంతో వార్తలు రాస్తున్నారని సజ్జల ఆరోపించారు. కుటుంబంతో ఈ నెల 7న ఢిల్లీ నుంచి వెళ్ళాను.. తిరిగి 14న ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో దిగి విజయవాడ వచ్చేందుకు సిద్ధం అవుతుండగా ఆపారని తెలిపారు. గుంటూరు ఎస్పీ నుంచి లోక్ వచ్చిందని చెప్పారు.. రీజన్ మాత్రం చెప్పలేదన్నారు. లుక్ ఔట్ నోటీసు అనేది వెళ్ళేటపుడు చేయాల్సి ఉంటుంది.. ఇక్కడ పోలీసులతో మాట్లాడాను.. హైకోర్టులో కేసు నడుస్తోందని ఈలోపు తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు ఉన్నాయని చెప్పానని సజ్జల పేర్కొన్నారు.
Nigeria: నైజీరియాలో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
రూల్స్ పాటించాల్సి ఉన్నప్పటికీ వాటిని ఇక్కడ పాటించటం లేదు.. కోర్టు ద్వారా తాను ముందుకు వెళ్తానని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. 10-10-2024లో లుక్ ఔట్ నోటీసు ఇచ్చారు.. తాను ఏడో తేదీ వెళ్లిన తర్వాత నోటీసు సిద్ధం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ మాదిరి పారిపోము.. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల వంటి నేతలపై కేసులు పెట్టిన చర్యలు విచారణ చేశాం.. తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని సజ్జల తెలిపారు. ఏపీలో ప్రభుత్వం ఉందా..? అరాచకానికి హద్దు అనేది లేదా.. రెడ్ బుక్ కంటే వరస్ట్గా నడుస్తోందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును జగన్ కక్ష పూరితంగా అరెస్టు చేయలేదు.. సిట్ నివేదిక ఆధారంగా మాత్రమే అరెస్టు జరిగింది అనేది ఈడీ చర్యలతో స్పష్టం అయిందని సజ్జల తెలిపారు.
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్టు చేయలేదు.. విచారణ జరిపి చేశారన్నారు. ముంబై నటి కేసులో కూడా స్టేట్‌మెంట్ రికార్డు కావాలని రికార్డు చేసి అరెస్టులు కేసులు పెడుతున్నారని సజ్జల తెలిపారు. మరోవైపు.. టీడీపీ ఆఫీసు కేసులో కూడా ఇలానే తన పేరు నమోదు చేశారన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కూడా కావాలని ప్లానింగ్ ప్రకారం రెచ్చగొట్టి చేసినట్టు అనిపిస్తుంది.. ఒకవైపు అరెస్టులు చేస్తుంటే మరోవైపు సీఐడీకి కేసు అప్పగించారని పేర్కొన్నారు. కార్యకర్తల మొదలు జగన్ సహా తప్పుడు కేసులు పెట్టడం జరుగుతోంది.. ఎన్నికల హామీలు వదిలేసి మేం ఏం చేయమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు అనిపిస్తోందని ఆరోపించారు. వేధింపులు మాత్రం తీవ్ర స్థాయికి తీసుకువెళ్తున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
-
Vaibhav Sooryavanshi Record: వైభవ్ సూర్యవంశీకి గుడ్‌న్యూస్.. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బద్దలే!
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25% వద్ద యథాతథం.. లక్షలాది మంది రుణగ్రహీతలకు ఊరట
-
Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..