Nigeria: నైజీరియాలో ఘోరం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి
- నైజీరియాలో ఘోరం
- పెట్రోల్ ట్యాంకర్ పేలి 100 మంది మృతి
- 50 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర నైజీరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 100 మంది మృతిచెందగా.. 50 మందికి పైగా గాయపడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. ఉత్తర జిగావా రాష్ట్రంలో రహదారిపై పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడింది. అయితే సమీపంలో ఉన్న స్థానికులకు ఈ సమాచారం తెలిసింది. రోడ్డుపై పడిన ఇంధనాన్ని సేకరించే పనిలో ఉండగా హఠాత్తుగా మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జనవరి నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల ఎప్పుడంటే..?
Also Read
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో హైవేపై బోల్తా పడింది. ప్రజలు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ట్యాంకర్‌కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా మంటలు ఎగబడటంతో భారీగా ప్రాణనష్టం జరిగిందని అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: Shabbir Ali : గత పదేళ్ల లో మీరేం చేశారో గుర్తుకు తెచ్చుకోండి
తాజావార్తలు
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!