Sajjala Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ప్రారంభించాం.. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.. వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన పోస్టర్‌ల ఆవిష్కరణ, కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అని తెలిపారు.. ఈ నెల 12న నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలకు అన్ని పార్టీలను, ప్రజా సంస్థలను కలుపుకుని పాల్గొనాలని సూచించారు. పార్టీ కమిటీలు, డేటా డిజిటలైజేషన్‌పై ప్రతి ఒక్కరూ సీరియస్‌గా దృష్టిపెట్టాలి. పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఆయన సూచించారు.
Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు.. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే నాటికి అంతా పకడ్బందీగా సిద్ధం కావాలి అని.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణా రెడ్డి.. అంతేకాక, ప్రజలకు మరింత చేరువయ్యేలా గొంతెత్తి నినదించాలి. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలి అని సూచించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కాగా, రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్‌లో అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతుండగా.. పీపీపీ అంటే.. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించడమే అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు.