RTA Special Drive in AP: ఆర్టీఏ స్పెషల్ డ్రైవ్.. ఏపీలో భారీగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్..
- కర్నూలులో బస్సు ప్రమాదంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన రవాణా శాఖ..
- రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు..
- నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై 289 కేసులు నమోదు..
- నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTA Special Drive in AP: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తం అయ్యారు.. ఇటు, తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్.. మరోవైపు బెంగళూరులోనూ ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దీంతో, కాలం చెల్లిన బస్సులను రోడ్డుపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.. మరోవైపు.. కర్నూలులో బస్సు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు రవాణా శాఖ అధికారులు.. రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రైవేట్ వాహనాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై ఈ రోజు ఇప్పటికే 289 కేసులు నమోదు చేశారు.. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు..
Read Also: Lalu Prasad: ‘అబద్ధాల రాజు’.. డబుల్ ఇంజిన్ సర్కార్‌పై లాలూ ప్రసాద్ మండిపాటు
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Tirupati Drugs Case : తిరుపతి డ్రగ్స్ కేసులో టీటీడీ ఉద్యోగి అరెస్ట్..
- CM Chandrababu : వియత్నాం బోటు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
ఇక, విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు కొనసాగనున్నాయి ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. అగ్నిమాపక పరికరాలు లేని ప్రైవేటు ట్రావెల్స్‌కు భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఇప్పటి వరకు 7.08 లక్షల రూపాయల వరకు జరిమానా విధించారు.. అత్యధికంగా ఏలూరులో 55 కేసులు నమోదు కాగా.. 3 ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు.. తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా.. 4 బస్సులు సీజ్.. కోనసీమ జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 22, కర్నూలు జిల్లాలో 12, విశాఖలో 7, నంద్యాలలో 4 కేసులు నమోదు చేశారు అధికారులు.. సరైన ధ్రువపత్రాలు లేని 8 బస్సులు, అత్యవసర ద్వారం లేని 13 బస్సులు, ఫైర్ పరికరాలు లేని 103 బస్సులు, ప్యాసింజర్ లిస్టు లేని కారణంగా 34 బస్సులు, ఇతర ఉల్లంఘనలపై 127 బస్సులపై కేసులు నమోదయ్యాయి.. ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.. మరోవైపు.. ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్ వైపు వెళ్లే పలు ప్రైవేట్ ట్రావెల్స్ బుకింగ్స్ రద్దు చేస్తున్నాయి పలు ట్రావెల్స్ సంస్థలు..
తాజావార్తలు
-
Tumbbad 2: హారర్ ప్రపంచంలోకి ఆలియా భట్.. ‘తుంబాడ్ 2’లో కీలక పాత్ర ఖరారు!
-
Michael Biopic: రూ.9,500 కోట్లకు పైగా వసూళ్లు.. ప్రపంచ బాక్సాఫీస్ చరిత్ర తిరగరాసిన బయోపిక్!
-
నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
-
Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
-
Lenin: ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్న తమన్.. ‘లెనిన్’ సక్సెస్ ఈవెంట్ లో కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!